calender_icon.png 1 November, 2024 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు తీవ్రగాయాలు

11-08-2024 10:42:45 AM

రాజేంద్రనగర్: నార్సింగి లో రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వీస్ రోడ్డు మై హోమ్ అవతార్ చౌరస్తా లో కారును టిప్పర్ లారీ ఢీకోంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. టిప్పర్ లారీలోని డ్రైవర్ కేబిన్ లో ఇరుకున్నాడు. సుమారు గంటసేపు శ్రమించి స్థానికులు అతడిని బయటకు తీశారు. అనంతరం హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కారు రాంగ్ రూట్ లో వచ్చినట్లు సమాచారం. నార్సింగి పోలీసులు సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించి విచారణ జరుపుతున్నారు.