18-04-2025 11:59:32 PM
చేర్యాల,(విజయక్రాంతి): చేర్యాల మండలం పోతిరెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి పిడుగు పడి మూడు గేదెలు మృతి చెందింయి. పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గుడిసె శ్రీధర్ అనే వ్యక్తి రెండు పాడే గేదెలు, అదే గ్రామానికి చెందిన గడ్డం నరేష్ అనే వ్యక్తి పాడి గేదె పిడుగుకు గురై మృతి చెందాయి. పాడి గేదలు మృతి చెందడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. విలువ సుమారు లక్ష యాభై వేలు దాకా ఉంటుందని బాధితులు తెలిపారు ఈ అకస్మాత్తుగా జరిగిన ఘటనతో రైతుకు తీవ్ర నష్టం జరిగింది.
అదేవిధంగా ముస్తాల గ్రామంలో ఎండి జాస్ గుడిసె పై ఉన్న రేకులు ఈదురుగాలులకు లేచిపోయాయి. దీంతో ఆయనకు నిల్వ నీడ లేకుండా పోయింది. ప్రభుత్వం తనని ఆదుకోవాలని కోరుతున్నడు. విషయం తెలుసుకున్న జనగాం ఎమ్మెల్యే డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు వెంటనే స్పందించి, శుక్రవారం బాధిత రైతుల కుటుంబాలను ఫోన్ ద్వారా పరామర్శించారు. వారి బాధను అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. అనంతరం స్థానిక తహసీల్దార్‌తో మాట్లాడి, ప్రభుత్వం తరఫున వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సహాయం వెంటనే అందే దిశగా తాను కూడా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.