హనుమకొండ, అక్టోబరు 2 (విజయక్రాంతి): వ్యక్తులపై దాడిచేసి దోపి డీలకు పాల్పడుతున్న ఒక మహిళతో పాటు ముగ్గురు నిందితులను హనుమకొండ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ లష్కర్ సింగారానికి చెందిన జన్ను రాజ్‌కుమార్, పోచమ్మ మైదాన్‌కు చెందిన కట్కూరి యాకూబ్, కట్కూరి రేణుక దోపిడీలకు పాల్పడుతున్నారు.
గత నెల 30న దేవన్నపేట ప్రాంతానికి చెందిన వ్యక్తి ఊరికి వెళ్లే ందుకు కిరాయి ఆటో కోసం గోపాల్‌పూర్ క్రాస్‌రోడ్డు వేచి ఉన్నాడు. ఈ క్రమంలో నిందితులు ముగ్గురు బాధితుడ్ని తీవ్రంగా కొట్టి ఆటోలో పోచమ్మకుంట స్మశానవాటిక వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ మరో మారు దాడి చేసి అతని వద్ద ఉన్న రూ.10 వేలు, ఒక సెల్‌ఫోన్ లాక్కున్నారు. బాధితుడి గూగుల్ పే నుంచి రూ.వె య్యి తమ ఖాతాలోకి బదిలీ చేయించుకున్నారు.
అనంతరం విడిచిపెట్టి వెళ్లిపోయారు. బాధితుడు హనుమకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చే యగా పోలీసులు కేసు నమోదు చే శారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను బుధవారం ఉద యం హనుమకొండ బస్టాండ్‌లో అ రెస్టు చేశారు. నిందితులను పట్టుకు న్న హనుమకొండ ఎస్సై సతీష్, హెడ్ కానిస్టేబుల్ రాహుఫ్, కానిస్టేబుల్ గౌస్‌పాషాను ఏసీపీ అభిన ందించారు.