24-02-2025 12:53:35 AM
హుజూర్ నగర్, ఫిబ్రవరి 23 : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధి మఠంపల్లి మండలంలో తాళం వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి,ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి ఆదివారం రిమాండ్ కు తరలించారు.
హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సిఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం మఠంపల్లి మండలంలో చోరీకి పాల్పడిన నిందితుల దగ్గర వారి వద్ద నుండి సుమారు లక్ష 30 వేల రూపాయల బంగారం స్వాధీనం పరుచుకుని మఠంపల్లి ఎస్త్స్ర బాబు సమక్షంలో రిమాండ్ కు తరలించారని తెలిపారు.