calender_icon.png 3 March, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9 కేజీల గంజాయి స్వాధీనం ముగ్గురు రిమాండ్

28-01-2025 07:06:25 PM

కోదాడ (విజయక్రాంతి): ఈనెల 27న నమ్మదగిన సమాచారం మేరకు మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి మోతే మండల పరిధిలోని మామిళ్ళగూడెం శివారులోని సింగరేణి టోల్ ప్లాజా సమీపంలో గల బాల భాస్కర విజయరామరాజు వెంచర్ లో ఉండగా ఎస్ఐ తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన బుర్రం సాయికుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన గుండి మురళీకృష్ణ భద్రాచలం రాజుపేట కాలనీకి చెందిన భాణోత్ పణికుమార్ ను అదుపులో తీసుకొని, తనిఖీ చేయగా తొమ్మిది కేజీల పైగా గంజాయి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా కోదాడ డిఎస్పి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. వాటితో పాటు రెండు సెల్ ఫోన్లను ఒక హీరో స్కూటీని స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు. మునగాల సిఐ రామకృష్ణారెడ్డి, మోతే ఎస్ఐ యాదవేందర్ రెడ్డి, ఐడి పార్టీ హెడ్ కానిస్టేబుల్ బాల్త్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ఎల్లారెడ్డి, బండి శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.