calender_icon.png 26 March, 2025 | 11:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముత్తాపూర్ లో ముగ్గురు పేకాట రాయుళ్ల అరెస్ట్

25-03-2025 11:01:02 PM

1500 నగదు, 2 ఆటోలు, 2 బైకులు స్వాధీనం.. 

ఏడుగురు వ్యక్తుల పరారీ..

బెల్లంపల్లి (విజయక్రాంతి): కన్నెపల్లి మండలంలోని ముత్తాపూర్ గ్రామ సరిహద్దుల్లో మంగళవారం సాయంత్రం కొంతమంది పేకాట ఆడుతున్నారని సమాచారంతో దాడులు చేయగా పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై గంగారం తెలిపారు. వీరి వద్ద నుండి రూ.1500 నగదుతో పాటు రెండు ఆటోలు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో ఏడుగురు వ్యక్తులు పారారైనట్లు చెప్పారు. పట్టుబడ్డ వారిలో కన్నెపల్లికి చెందిన నికారి మహేష్, నికారి సురేష్, ముత్తాపూర్ కు చెందిన సుంకరి తిరుపతిలో ఉన్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. ముత్తాపూర్ కు చెందిన కుట్రంగి దివాన్, గురుండ్ల రాజు, నాగోష శ్రీను, తుపాకుల వెంకటి, చండే శేఖర్, రాజు, నరేష్(శికినం), మోహన్ లు ఉన్నట్లు ఎస్సై గంగారాం తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.