calender_icon.png 26 December, 2024 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైవర్‌ను బండరాయితో మోది కారుతో పరార్

25-12-2024 08:19:09 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): డ్రైవర్ ను బండరాయితో మోది అద్దెకు తెచ్చిన కారుతో ముగ్గురు వ్యక్తులు పరారైన సంఘటన బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దిన్ తెలిపిన వివరాలు ప్రకారం... కాగజ్ నగర్ లో ముగ్గురు వ్యక్తులు మంచిర్యాలకు వెళ్లాలంటూ కాగజ్ నగర్ కు చెందిన పాముల పురుషోత్తం అనే డ్రైవర్ కారును కిరాయికి మాట్లాడుకున్నారు. కాగజ్ నగర్ లోని వెంకటేశ్వర బార్ లో మద్యం సేవించి మంచిర్యాలకు వెళుతుండగా ముగ్గురు వ్యక్తుల్లో ఒకరు బెల్లంపల్లి శ్రీనిధి హోమ్ దగ్గర దిగుతానని చెప్పారు.

బెల్లంపల్లి హనుమాన్ విగ్రహం దగ్గర యూటర్న్ తీసుకొని కొద్ది దూరం వెళ్ళాక తిరుమల హిల్స్ దాటగానే మూత్ర విసర్జన కోసం డ్రైవర్ కారు దిగారు. దీంతో ముగ్గురు వ్యక్తులు బండరాయితో కారు డ్రైవర్ తలపై కాలపై బాధడంతో కిందపడ్డాడు. దీంతో డ్రైవర్ మృతి చెందాడని భావించిన వారు అతని వద్దనున్న రూ 3500 నగదు, సెల్ ఫోన్ తీసుకున్నారు. ఏపీ 26 ఏ క్యూ 2929 నెంబర్ గల కారుతో కాగజ్ నగర్ వైపు పారిపోయారు. గాయపడ్డ డ్రైవర్ పాముల పురుషోత్తం కుమారుడు పాముల ప్రవీణ్ తాళ్ల గురజాల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అఫ్జలొద్దిన్ తెలిపారు.