కొండపాక,(విజయక్రాంతి): కొండపాక శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం ఆర్టీసీ బస్సును కారు ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన పలువురు కొండపోచమ్మ దేవాలయానికి కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణం చేస్తున్న నాగరాజు, నర్సింలు, లక్ష్మన్ లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, టోల్ గేట్ అంబులెన్స్ సిబ్బంది పరశురాములు, రాకేష్ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.