calender_icon.png 26 December, 2024 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులో దూకి ముగ్గురి బలవన్మరణం

26-12-2024 02:41:21 AM

  1. మృతుల్లో ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్
  2. కట్టపై బిక్కనూర్ ఎస్సై కారు
  3. కామారెడ్డి జిల్లాలో విషాదం

కామారెడ్డి, డిసెంబర్ 25 (విజయక్రాంతి): చెరువులో దూకి ఓ ఎస్సై, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపుతున్నది.

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేటలో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, అక్కడే కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నిఖిల్ బుధవారం రాత్రి అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. చెరువు కట్టపై ఎస్సై కారుతో పాటు ముగ్గురి చెప్పులు, మూడు సెల్ ఫోన్లు దొరికాయి.

మృతదేహాల కోసం పోలీసులు చెరువులో గాలిస్తున్నారు. ఘటన స్థలానికి ఎస్పీ సింధూశర్మ చేరుకుని పరిశీలిస్తున్నారు. కానిస్టేబుల్ శృతిని కాపాడేందుకు వెళ్లి సాయికుమార్‌తో పాటు ఆపరేటర్ నిఖిల్ మృతి చెందినట్లు తెలుస్తున్నది. కానిస్టేబుల్ శృతికి, ఎస్సై సాయికుమార్ మధ్య జరిగిన గొడవే ఆత్మహత్యకు దారి తీసినట్లు తెలుస్తున్నది.