ఒకరి పరిస్థితి విషమం
బెల్లంపల్లి, డిసెంబర్ 11: ఆర్థిక ఇబ్బందులు తాళలేక తాండూర్ మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. వారిలో సముద్రాల మొండ య్య (60), సముద్రాల శ్రీదేవి (50), సముద్రాల చైతన్య (30), సముద్రాల శివప్రసాద్ (26) ఉన్నారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్న వారిలో బుధవారం మొండయ్య, శ్రీదేవి, చైతన్య మృతి చెందారు. శివప్రసాద్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో కాసిపేట గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శివప్రసాద్ ఆన్‌లైన్ పెట్టుబడులు పెట్టి నష్టపోవడంతో అప్పులు ఇచ్చిన వారి వేధింపులు తాళలేక కుటుంబమంతా ఆత్మహత్యాయ త్నానికి పాల్పడిన సంఘటన తెలిసిందే.