న్యూఢిల్లీ: ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ప్రాథమిక నివేదికల ప్రకారం, దంపతులు, వారి కుమార్తె వారి ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఉదయం వాకింగ్ నుండి తిరిగి వచ్చిన వారి కుమారుడు ఇంట్లో పడి ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యుల మృతదేహాలను చూసి షాక్ తిన్న అతను స్పృహతప్పిపడిపోయాడు. మృతులను రాజేష్ తన్వర్, కోమల్, కవితగా గుర్తించారు. ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతనం కేసు దర్యాప్తు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.