calender_icon.png 10 October, 2024 | 8:57 AM

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

10-10-2024 01:19:32 AM

 ప్రోటీన్ల నిర్మాణంపై పరిశోధనలకుగాను పురస్కారం

సగం ప్రైజ్ బేకర్‌కు.. హసబిస్, జంపర్‌కు మిగిలిన సగం 

ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: రసాయనశాస్త్రం లో ముగ్గురిని నోబెల్ వరించింది. ప్రోటీన్ల నిర్మాణంపై పరిశోధనలకు గాను డేవిడ్ బేక ర్, డెమిస్ హసబిస్, జాన్ జంపర్ 2024 నోబెల్ ప్రైజ్‌కు ఎంపికయ్యా రు. ఈ మేరకు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది.

బహుమతిలో సగం బేకర్ పంచు కుంటారని, మరో సగం హస్సాబిస్, జంపర్ చెందుతుందని అకాడ మీ పేర్కొంది. బేకర్ కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లపై పరిశోధనలు చేశారు. ప్రోటీన్ల నిర్మా ణం అంచనాపై  జంపర్, హసబిస్ రీసెర్చ్ చేశారు. కీలకమైన ప్రోటీన్ల నిర్మాణంపై ఈ ఏడాది అద్భుతమైన పరిశోధనలు జరిగాయని, అమైనో ఆమ్లాల నుంచి ప్రోటీన్ల నిర్మాణాన్ని అంచనా వేయాలనే 50 ఏళ్ల కలను ఈ శాస్త్రవేత్తలు నెరవేర్చారని అకాడమీ పేర్కొంది.

ప్రోటీన్ల నిర్మాణంపై..

బేకర్ సియాటెల్‌లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో పనిచేస్తుండగా హసబిస్, జంపర్ లండన్‌లోని గూగుల్ డీప్‌మైంట్‌లో పరిశోధనలు నిర్వహిస్తున్నారు. 2003లో బేకర్ కొత్త ప్రోటీన్‌ను రూపొందించారు. ఫార్మా, టీకాలు, నానో మెటీరియల్స్, చిన్న సెన్సార్లుగా ఉపయోగపడే ఊహాజనిత ప్రోటీన్‌ను సృష్టించారని నోబెల్ కమిటీ తెలిపింది.

జంపర్, హసబిస్ కృత్రిమ మేధను ఉపయోగించి ప్రోటీన్ నమూనాను రూపొందించిన ట్లు పేర్కొంది. దీనిద్వారా 200 మిలియన్ ప్రోటీన్ల నిర్మాణాన్ని గుర్తించగలిగాలని తెలిపింది. వీరి ముగ్గురికి నోబెల్ ప్రైజ్ కింద 11 లక్షల డాలర్లు అందిస్తారు. ఇందులో సగం బేకర్‌కు, మరో సగం హసబిస్, జంపర్ అందుకుంటారు. 

నేడు సాహిత్య విభాగం

ఇప్పటివరకు మొత్తం 3 విభాగాల్లో నోబె ల్ బహుమతిని ప్రకటించారు. వైద్యశాస్త్రం లో మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు క్రమబద్ధీకరణపై పనిచేసిన విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్‌కున్‌ను ఎంపిక చేశారు. అనంతరం భౌతిక శాస్త్రంలో కృత్రిమ మేధ సృష్టికర్తలు జెఫ్రీ హింటన్, జాన్ హాప్‌ఫీల్డ్‌కు ప్రకటించారు.

తాజాగా రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తల పేర్లను నోబెల్ గ్రహీతలను పేర్కొనగా.. గురువారం సాహిత్య రంగానికి చెందిన విజేతలను ప్రకటించనున్నారు. శుక్రవారం నోబె ల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో విజేతలను వెల్లడిస్తారు. డైనమైట్ సృష్టికర్త, వ్యాపారవేత్త ఆల్ఫెడ్ నోబెల్‌కు చెందిన ట్రస్ట్ 1901 నుంచి వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ ప్రైజ్‌ను అందిస్తోంది.