05-04-2025 10:08:54 AM
విదేశాలకు అక్రమంగా డబ్బు బదిలీ చేస్తున్న ముఠా అరెస్ట్
నిందితుల నుంచి డ్రగ్స్ స్వాధీనం
డ్రగ్స్ తో సంపాదించిన డబ్బు హవాల
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. విదేశాలకు అక్రమంగా డబ్బును బదిలీ(Hawala Money Transfer) చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా డ్రగ్స్ విక్రయం ద్వారా వచ్చిన డబ్బును హవాల రూపంలో విదేశాలకు తరలిస్తోంది. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో(Narcotics Control Bureau) పోలీసులు ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్(Nigerians arrested) చేశారు.
నిందితులు డార్క్ వెబ్, ఫారెక్స్ మనీ ఏజెంట్ల ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి రూ. 12.50 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. భారత్ తో పాటు అమెరికాలోనూ నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. అమెరికా(United States)లో యువతులను ట్రాప్ చేస్తున్న నిందితులు వారి ద్వారా డబ్బు భారత్ కు పంపుతున్నారు. అమెరికా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు భారత్ కు నగదు బదిలీ చేస్తున్నారు. భారత్ నుంచి అక్రమ మార్గంలో సొంత దేశం నైజీరియా(Nigeria)కు నగదు బదిలీ చేస్తున్నట్లు గుర్తించారు. నైజీరియన్లు ఫారెక్స్, మనీ ట్రాన్స్ ఫర్ల ద్వారా డబ్బులు పంపుతున్నారని పోలీసులు వెల్లడించారు.