calender_icon.png 10 October, 2024 | 7:54 PM

ఆర్బీఐ ఎంపీసీలోకి ముగ్గురు కొత్త సభ్యులు

03-10-2024 12:00:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 2: రిజర్వ్‌బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో ముగ్గురు కొత్త సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. వివిధ రంగాల్లో నిపుణులైన రామ్ సింగ్, సౌగంధ భట్టాచార్య, నగేశ్ కుమార్‌లు కమిటీలో నాలుగేండ్లు కొనసాగుతారు.ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలో వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకునేది ఈ కమిటీయే. 

రామ్ సింగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ డైరెక్టర్ కాగా, నగేశ్ కుమార్ ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్నారు. సౌగంధ భట్టాచార్య ఆర్థిక వేత్త. పునర్‌వ్యవస్థీకరించిన కొత్త కమిటీ తొలి సమావేశం అక్టోబర్ 7-9 తేదీల మధ్య మూడురోజులపాటు జరుగుతుంది.

కమిటీ నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్ అక్టోబర్ 9న వెల్లడిస్తారు. ఇప్పటివరకూ కమిటీలో ప్రభుత్వ నియమిత సభ్యులుగా ఉన్న అషీమా గోయల్, శశాంక్ భిడే, జయంత్ వర్మ స్థానాల్లో కొత్త సభ్యులు నియమితులయ్యారు. కమిటీలో ఆర్బీఐ గవర్నర్‌కాకుండా ఆరుగురు సభ్యులు వుంటారు. అందులో ముగ్గురు ఆర్బీఐ అధికారులుకాగా, మరో ముగ్గుర్ని ప్రభుత్వం నియమిస్తుంది.