calender_icon.png 10 January, 2025 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కిల్ వర్సిటీలో మూడు కొత్త కోర్సులు

10-01-2025 01:37:46 AM

నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి): ప్రైవేట్ రంగంలో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ కొత్తగా మూడు కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీవర్క్స్ భాగస్వామ్యంతో మూడు కోర్సులను నిర్వహించనున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కార్యాలయం గురువారం పేర్కొంది.

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొత్త కోర్సుల సమాచారాన్ని తెలుసుకునేందుకు www.yisu.inను సందర్శించాలని వర్సిటీ అధికారులు సూచిస్తున్నారు.