25-03-2025 01:31:04 PM
ఛత్తీస్‌గఢ్,(విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అడవిలో ఇవాళ ఉదయం 8 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది బృందం నక్సలైట్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో ఇరువర్గాలకు మధ్య కాల్పులు జరిగాయని పోలీసు అధికారి తెలిపారు.
సంఘటనా స్థలం నుండి ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలను, తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. మార్చి 20న రాష్ట్రంలోని బీజాపూర్-కాంకేర్ జిల్లాల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు 30 మంది నక్సలైట్లను కాల్చి చంపగా.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చోటు చేసుకున్న పలు ఎన్ కౌంటర్లలో 90 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అంచనా.