calender_icon.png 23 December, 2024 | 10:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్‌యూ వీసీగా ముగ్గురి పేర్లు

15-10-2024 12:38:11 AM

కరీంనగర్, అక్టోబర్ 14 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పలు విశ్వవిద్యాలయాలకు త్వరలో ఉపకులపతులను నియమించనుంది. ఇటీవల సెర్చ్ కమిటీ సమావేశమైన శాతవాహన యూనివర్సిటీ వీసీ కోసం ముగ్గురి పేర్లను రాజ్‌భవన్‌కు పంపించింది.

ఎస్‌యూ వీసీ కోసం 153 మంది ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకోగా కరీంనగర్‌కు చెందిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉర్దూ విభాగం మాజీ అధిపతి, మాజీ డైరెక్టర్ సయ్యద్ అబ్దుల్ షుకూర్, ప్రొఫెసర్ గణేశ్, ప్రొఫెసర్ వీరస్వామి పేర్లను సెర్చ్ కమిటీ ప్రతిపాదించింది. షుకూర్ కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యావేత్త కావడంతో ఆయనకే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా మైన్స్ అండ్ జియాలజీ విభాగం కార్యదర్శిగా జగిత్యాల మాజీ ఆర్డీవో సురేంద్ర మోహన్ పనిచేస్తున్నారు.

కాగా బీసీ సామాజికవర్గానికి చెందిన ప్రొఫెసర్‌ను వీసీగా నియమించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి విజ్ఞప్తి కూడా చేశాయి. అయితే ఈ ముగ్గురిలో ఎవరిని ప్రభుత్వం నియమిస్తుందో వేచి చూడాల్సిందే.