calender_icon.png 7 January, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో మూడు రోజుల వర్షాలు

12-10-2024 12:02:16 AM

ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్, అక్టోబర్ 11(విజయక్రాంతి): తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఉరుములు, మెరుపులతో వానలు పడుతాయని చెప్పింది.

ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షపు తీవ్రత ఉంటుందని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.