13-02-2025 08:27:18 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టెక్స్ ప్రాంతంలో గల ఎస్ఆర్ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ లో ఈనెల 7న తాండూర్ మండలానికి చెందిన బండారి వంశీ అనే యువకుడి పై బీర్ సీసాతో దాడి చేసి గాయపరిచిన కేసులో మరో ముగ్గురు నిందితులను గురువారం సాయంత్రం అరెస్టు చేసినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలొద్దిన్ తెలిపారు. బెల్లంపల్లి కన్నాల బస్తీకి చెందిన కోట సౌషీల్, శాంతిఖని బస్తీకి చెందిన కాలం నవీన్, బెల్లంపల్లి రైల్వే స్టేషన్ కు చెందిన చింతం సాయికుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కోసం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ అఫ్జలొద్దిన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్ఐ కె.మహేందర్ పాల్గొన్నారు.