calender_icon.png 3 October, 2024 | 6:55 PM

మూడు నెలలు అధిక వర్షపాతం

03-10-2024 02:24:05 AM

రేపు, ఎల్లుండి వానలు

హైదరాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్‌లో ఉత్తర తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, దక్షిణ తెలంగాణలో తక్కువ నమోదవుతుందని పేర్కొంది. రాష్ట్రంలో రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది.

ఈ మేరకు వర్ష సూచన ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.