మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): వరదలపై వాతావరణ కేంద్రం హెచ్చరించినా సీఎం, మంత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని మాజీమంత్రి నిరంజన్‌రెడ్డి ఆవే దన వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. వరదలో చిక్కుకున్న 9మంది కుటుంబ సభ్యులకు సాయం చేయలేకపోయారన్నారు. వారి ప్రాణాలను రక్షించిన సుభాన్ ముందు ముగ్గురు మంత్రులు జీరో అయ్యారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌పై మంత్రులకు కూడా గౌరవం లేదన్నారు.
ఎన్నికల ప్రచారంలో నాలుగైదు హెలికాఫ్టర్లు వాడిన కాంగ్రెస్ లీడర్లు వరద బాధితుల కోసం వాటిని ఎందుకు వినియోగించలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ను విమర్శించడం మాని వరద బాధితులను ఆదుకోవడంపై శ్రద్ధ చూపాలన్నారు. వరదల్లో వ్యక్తి చనిపోతే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం కొత్త కాదని, ప్రతిపక్షంలో ఉండగా రేవంత్ వరదల విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, వాటినే అమలు చేయాలని కోరారు. రాష్ర్టంలో 18 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ఇప్పటివరకు ప్రభుత్వం నష్టం వివరాలు వెల్లడించలేదన్నారు.