calender_icon.png 19 March, 2025 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గురు మంత్రి అనుచరులే..

19-03-2025 02:25:08 AM

ఏఎంసీ పీఠం కోసం ప్రయత్నాలు..

కరీంనగర్, మార్చి18(విజయక్రాంతి): కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికోసం ముగ్గురు కాంగ్రెస్ నేతలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ ముగ్గురు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచరులే. అయితే రెండునెలలుగా భర్తీ  చేయకపోవడం తో ఆశవాహుల్లో ఆందోళన మొదలయింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వైద్యుల అంజన్ కుమార్, బొమ్మ ఈశ్వర్ గౌడ్, సూదగోని లక్ష్మినారాయణ గౌడ్ లు పదవి కోసం మంత్రి చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు.

నిజానికి అంజన్ కుమార్ కు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవికి పొన్నం ప్రయత్నించారు కూడా అయితే ఆ పదవి రాకపోవడంతో అంజన్ జిల్లా స్థాయి లో మార్కెట్ కమిటీ అయినా ఇవ్వాలని కోరుతున్నారు.

అయితే అంజన్ పేరును నియోజకవర్గ పార్టీ ఇంచార్జి పురమల్ల శ్రీను ప్రతిపాదించడం తో పొన్నం ఆగ్రహం తో ఉన్నట్టు తెలిసింది. తనకు వ్యతిరేకంగా రాజకీయం నడిపి పి సి సి నుండి షోకాజు నోటీస్ అందుకున్న వ్యక్తి ప్రతిపాదించడం మంత్రి ఆగ్రహానికి కారణంగా తెలుస్తుంది. అంజన్ మంత్రి అనుచరుడిగా ఉండి ఆ రూట్ లో రావడం నియామకం జాప్యానికి కారణంయింది.

ఈ పదవిని ఆశిస్తున్నా మరో నాయకుడు బొమ్మ ఈశ్వర్ గుడ్ మంత్రి అనుచరుడే. పి సి సి అధ్యక్షుడు మహేష్ కుమార్ గోడు కు ఈశ్వర్ గౌడ్ సమీప బంధువు కూడా కావడంతో ఆయన రెండు వైపులా ప్రయత్నాలు చేస్తున్నారు. మనకొండూర్ నియోజకవర్గం కు చెందిన సూదగోని లక్ష్మినారాయణ గౌడ్ మొదటి నుండి పొన్నం అనుచరుడిగా ఉంటున్నాడు. పక్క నియోజకవర్గం కావడంతో కరీంనగర్ నియోజకవర్గ నేతలు అడ్డుపడున్నట్టు తెలసింది.

కరీంనగర్ మార్కెట్ కమిటీ పదవి కోసం వీరు కాకుండా మరికొందరు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గా రాంరెడీ పేరు పై ఏకాభిప్రాయం ఉండగా చైర్మన్ ఎంపిక ఆలస్యం అవుతుండటం తో మంత్రి ఎవరికి పదవి అంటగడుతారో అన్న సస్పెన్షన్ పార్టీ వర్గాల్లో నెలకొంది. తాజా పరిణామాల కారణంగా పాలకవర్గం వస్తుందా...పదవీకాలం ముగుస్తుందా చూడాలి.