13-04-2025 01:42:13 AM
ఈ ఏడాది ఇప్పటివరకు 138 మంది హతం
బీజాపూర్, ఏప్రిల్ 12: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి జాతీయ పార్కు ప్రాంతంలోని అడవుల్లో శనివారం ఉదయం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు నిరోధక ఆపరేషన్‌లో భాగం గా భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్ అడవుల్లో గత కొన్ని రోజులుగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
ఘటనా స్థలం నుంచి మవోయిస్టు లకు చెందిన మూడు మృతదేహాలతోపాటు పెద్దఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ వెల్లడించారు. అలాగే, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని స్ప ష్టం చేశారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన వేర్వేరు ఎదురుకాల్పుల్లో 138 మంది మావోయిస్టులు మృతి చెందారు.