calender_icon.png 1 April, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగార సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

29-03-2025 10:31:24 PM

ఉగాది సంబరాలకు సర్వం సిద్ధం.. జవ్వాది రవి 

చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల రాహుల్ విజ్ఞాన విద్యాలయం హాస్టల్ ప్రాంగణంలో ఉగాది పండుగ పురస్కరించుకొని నగార ఉగాది సంబరాలు నిర్వహిస్తుంది ఇందులో  భాగంగా శనివారం మహిళలకు ముగ్గులు పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలో సుమారు 30 మంది మహిళలు పాల్గొని వారి రంగవల్లిలను 60 నిమిషాల వ్యవధిలో  అద్భుతమైన రంగులతో రూపుదీదిద్దారు.

ప్రధమ ద్వితీయ తృతీయ ప్రత్యేక బహుమతికి సంబంధించిన బహుమతులను ఆదివారం గ్రంథాలయం ప్రాంగణం సురేష్ ఓపెన్ ఆర్ట్స్ థియేటర్ లో సాయంత్రం జరిగే ఉగాది సంబరాలు నగార సాంస్కృతిక సేవా సంస్థ వారు నిర్వహించే కార్యక్రమాలను ఈ బహుమతులను ప్రధానం చేస్తారనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి నగార సంస్కృత సేవ సంస్థ కమిటీ సభ్యులు జవ్వాది రవి, తడికల లాలయ్య, ఆడెపు ముత్యాలరావు, సుందర పెద్దిరాజు, సిహెచ్ వీరభద్రం, మేడిచర్ల కుమార్, కోట రత్నాజీ, గూడపాటి సతీష్, సి ఎల్ నారాయణ (చిన్న), జి లక్ష్మణ్ కుమార్, తడకల నరేష్, తంగెళ్లపల్లి శంకరాచారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.