ములకలపల్లి (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం పరిధిలోని ములకలపల్లి మండలం వికే రామవరం పంచాయతీ కొత్తూరు గ్రామ సమీపంలో అక్రమంగా నిలువ ఉంచిన మూడు లారీల ఇసుకను బుధవారం రెవెన్యూ అధికారులు సీట్ చేశారు. సీజ్ చేసిన ఇసుకను అనంతరం ములకలపల్లి తాసిల్దార్ కార్యాలయానికి తరలించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.