calender_icon.png 19 April, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐస్‌క్రీమ్ ఫ్లేవర్ గుర్తిస్తే 3 లక్షలు

09-04-2025 12:00:00 AM

ఏప్రిల్ 27న హైబిజ్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్

హైదరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): ఐస్‌క్రీమ్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న హైబిజ్ టీవీ ది గ్రేట్ ఇండియన్ ఐస్‌క్రీమ్ టేస్టింగ్ ఛాలెంజ్ మళ్లీ వచ్చేస్తోంది. ఏప్రిల్ 27న మూడోసారి ఈ కార్యక్రమం జరుగబోతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం కర్టెన్ రైజర్ ఈవెంట్‌ను హైదరాబాద్ ఎర్రమంజిల్ ప్రీమియా మాల్ వేదికగా నిర్వహించారు. సినీనటి కావ్య కల్యాణ్‌రామ్, బిగ్‌బాస్ ఫేమ్ శ్వేతవర్మ, యాక్టర్ సమీర్ హాజరయ్యారు. వారితో పాటు సుహాస్ బి.శెట్టి (ఫౌండర్, సీఈవో, ఆర్గానిక్ క్రీమరీ బై ఐస్‌బర్గ్ ఐస్‌క్రీమ్స్), కేవీ నాగేంద్రప్రసాద్ (లీజింగ్, అడ్వర్టైజింగ్ బిజినెస్ హెడ్, ఎల్‌టి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ హైబిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (ఎండీ హైబిజ్ టీవీ ఎల్.ఎల్.పి) పాల్గొన్నారు.

కళ్లకు గంతలు కట్టుకుని ఐస్‌క్రీమ్ టేస్ట్ చేసి దాని ఫ్లేవర్ చెప్పాల్సి ఉంటుంది. అలా ఎవరు ఎక్కువగా రుచిచూసి చెప్తే వాళ్లే విజేతలుగా నిలుస్తారు. ఫస్ట్ ప్రైజ్ రూ.లక్ష, సెకండ్ ప్లేస్‌లో నిలిస్తే రూ.50 వేలు, 3వ బహుమతిగా రూ.25 వేలు అందిస్తారు. 25 మంది లక్కీ డ్రా విన్నర్స్‌ను కూడా ఎంపిక చేస్తారు. ఈ కార్యక్రమానికి ఐస్‌బర్గ్ ఐసీక్రీమ్స్ ఆధ్వర్యంలోని ఆర్గానిక్ క్రీమరీ సహకారం అందిస్తోంది. ఏప్రిల్ 27న ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ పక్కన ఉన్న ప్రీమియా మాల్‌లో ఈ పోటీ జరుగుతుంది. ఈ పోటీలో పాల్గొనే వారు రూ.250 ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనాలనుంటే వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ కావచ్చు.