calender_icon.png 8 October, 2024 | 11:53 PM

తొలి 4 నెలల్లో ద్రవ్యలోటు 2.76 లక్షల కోట్లు

31-08-2024 12:36:33 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 30: కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో  రూ.2,76,945 కోట్లుగా నమోదయ్యింది. ఇది పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యంలో 17.2 శాతం. శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏప్రిల్ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నికర పన్ను వసూళ్లు రూ.7.15 లక్షల కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 27.7 శాతం).  మొత్తం  వ్యయం రూ.13 లక్షల కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 27 శాతం). ఇందులో రెవిన్యూ ఖాతాలో రూ.10,39,091 కోట్లు, క్యాపిటల్ ఖాతాలో రూ.2,61,260 కోట్లు వ్యయమయ్యాయి. రెవిన్యూ వ్యయంలో రూ.3.27 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులకు, రూ.1.25 లక్షల కోట్లు ప్రధాన సబ్సిడీలకు ఖర్చయ్యింది.