calender_icon.png 15 January, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బావి కూలి కూలీలు మృతి.. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా

15-01-2025 04:45:02 PM

చింద్వారా: మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో బావి కూలిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలు మృతి చెందారని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్(Chief Minister Mohan Yadav) బుధవారం తెలిపారు. జిల్లాలోని ఖునాజీర్ ఖుర్ద్ గ్రామంలో మంగళవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న బావిలో ఒక మహిళ సహా ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారని అధికారులు ముందుగా తెలిపారు. పోలీసులు, హోంగార్డు సిబ్బంది, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (National Disaster Response Force) బృందం తక్షణమే రెస్క్యూ వర్క్‌ను ప్రారంభించి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, అయితే వారిని రక్షించలేకపోయామని సిఎం యాదవ్ ఎక్స్‌లో పోస్ట్‌లో తెలిపారు.

చింద్వారా జిల్లా ఖునాజీర్ ఖుర్ద్ గ్రామం(Khunajhir Khurd village of Chhindwara district)లో ఒక ప్రైవేట్ భూమిలో పాత బావిని తవ్వే సమయంలో మట్టి కూలిపోవడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.4 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ తీరని దుఃఖాన్ని తట్టుకునే శక్తిని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మృతులు షాజాదీ ఖాన్ (50), ఆమె కుమారుడు రషీద్ (18), మేనల్లుడు బాషిద్ (18) అని అధికారులు తెలిపారు.