అమెరికాలోని మాడిసన్‌లో ఘటన
మాడిసన్, డిసెంబర్ 17: అమెరికాలోని విద్యాసంస్థల్లో గన్‌కల్చర్ పెచ్చరిల్లుతున్నది. తరచూ ఏదో ఒక విద్యాసంస్థలో కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్యార్థుల ప్రాణాల ను బలి తీసుకుంటున్నాయి. విస్కాన్సిన్ రాష్ట్రంలోని మాడిసన్ అబుండంట్ లైఫ్ క్రిస్టియన్ స్కూలులో సోమవారం మళ్లీ కాల్పులు జరిగా యి. కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో కాల్పులకు తెగబ డిన ఉన్మాది కూడా ఉన్నారని తెలిసింది. కాల్పులు జరిపిన వ్యక్తి బాలి క అని సమాచారం. కాల్పులకు వెనుక కార ణం ఏమిటి? ఎంతమంది కాల్పులకు తెగబడ్డారు? అనే అంశాలపై త్వరలో వారు అధికారిక ప్రకటన విడుదల చేయనున్నారు.