calender_icon.png 29 March, 2025 | 9:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్యానాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

26-03-2025 07:10:48 PM

హర్యానా,(విజయక్రాంతి): హర్యానాలో హోరా రోడ్డు ప్రమాదం జరిగింది. సిర్సా జిల్లాలోని దబ్వాలిలో బుధవారం జీపు క్యాంటర్ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గుజరాత్ పోలీసు సిబ్బందితో సహా ముగ్గురు మరణించగా, మరో పోలీసు అధికారి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డిన క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో వాహనంలో నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారని, మృతి చెందిన వారిలో ఒక హెడ్ కానిస్టేబుల్, గుజరాత్ పోలీసు హోమ్ గార్డ్, మరొకరు ఉన్నారు. గుజరాత్ పోలీసు ప్రొబేషనరీ సబ్-ఇన్స్పెక్టర్ గాయపడ్డార అని దబ్వాలి పోలీసు సూపరింటెండెంట్ సిద్ధాంత్ జైన్ తెలిపారు.

గుజరాత్ పోలీసు వాహనం ఆగి ఉన్న క్యాంటర్ ట్రక్కును ఢీకొట్టిందనట్లుగా జైన్ ప్రాథమిక విచారణలో తెలింది. ఈ సందర్భంగా దబ్వాలిలోని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమేష్ కుమార్ మాట్లాడుతూ... క్షతగాత్రుడిని దబ్వాలిలోని ఒక ఆసుపత్రి నుండి బతిండాలోని ఎయిమ్స్‌కు రిఫర్ చేసినట్లు తెలిపారు. దబ్వాలిలోని సక్త ఖేరాలోని భారత్ మాలా రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని డిఎస్పీ తెలిపారు. గుజరాత్ పోలీసు బృందం ఏదో కేసుకు సంబంధించి పంజాబ్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన వెల్లడించారు. పోలీసు వాహనం గుజరాత్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉండగా, క్యాంటర్ ట్రక్కు పంజాబ్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను కలిగి ఉందని డీఎస్పీ తెలిపారు.