calender_icon.png 4 February, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి కేసులో ముగ్గురికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

04-02-2025 06:26:47 PM

టేకులపల్లి (విజయక్రాంతి): గంజాయి కేసులో పది సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ (ఎఫ్.ఏ.సి. స్పెషల్ జడ్జి ఫర్ ఎన్.డి.పి.ఎస్. మొదటి అదనపు జిల్లా జడ్జి) పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా.. టేకులపల్లి అప్పటి ఎస్సై జి.ప్రవీణ్ కుమార్ 2019 నవంబర్ 11న టేకులపల్లి సెంటర్లో వాహన తనిఖీ చేస్తుండగా మహబూబాబాద్ కు చెందిన, గూడూరు మండలం చెందిన భూక్య రాము, బోడా సుమన్, నల్గొండ జిల్లా నార్కెట్పల్లి పల్లిపాడుకు చెందిన బొంతు శంకరయ్య పసుపు రంగు గల టిఆర్ నెంబర్ గల ఆటోను టేకులపల్లిలోని బోడు కు వెళ్లేసెంటర్ లో ఆపి పరిశీలించగా అట్టి ఆటోలో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయని వాటి బరువు 31 కేజీ 165 గ్రాములు వాటి విలువ 4 లక్షల 67,470/- రూపాయలు కలిగి ఉన్నదని టేకులపల్లి పోలీస్ స్టేషన్లో  కేసు నమోదు చేశారు.

దర్యాప్తు అనంతరము అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. రాజు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. కోర్టులో ఐదుగురు సాక్షుల విచారణ అనంతరము పై ముగ్గురిపై నేరము రుజువు కాగా, ఒక్కరికి పది సంవత్సరాల కఠిన కారగార శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాస్క్యూషన్ స్పెషల్ ఆదనపు పబ్లిక్ ప్రాసెక్యూటర్, పి.వి.డి.లక్ష్మి లు నిర్వహించారు. నోడల్ ఆఫీసర్ (ఎస్. ఐ.) జి.ప్రవీణ్ కుమార్, కోర్టు లైజన్ ఆఫీసర్ ఎస్. కె.అబ్దుల్ ఘని, పిసి (కోర్టు డ్యూటీ ఆఫీసర్) పులి రమేష్ లు సహకరించారు.