calender_icon.png 15 January, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు

02-12-2024 11:55:56 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని నూతన రైల్వే బ్రిడ్జిపైన జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలైన ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. రైల్వే వంతెనపై స్కూటి, మోటార్ సైకిల్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పట్టణానికి చెందిన అక్షయ్, భారత్ కాలు, తలకు గాయాలు కాగా స్థానికులు 108కి సమాచారం అందించడంతో క్షతగాత్రులను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే రైల్వే వంతెనపై ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్న వాసు తలకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రున్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.