24-04-2025 04:52:21 PM
నిర్మల్ (విజయక్రాంతి): హైదరాబాద్ నాగపూర్ జాతీయ రహదారిపై సోను మండలంలోని కడ్తాల్ వద్ద గురువారం ఉదయం మిర్చి లోడుతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు మిర్చి సంచులను తీసుకెళ్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో అందులో ప్రయాణం చేసిన ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వారిని నిర్మల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.