calender_icon.png 28 October, 2024 | 11:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెదవాగు గండితో 391.19 ఎకరాల్లో ఇసుక మేట

30-07-2024 12:05:00 AM

  1. 4 గ్రామాల్లో నిలిచిన సాగు 
  2. ఇసుక తోలకాల పేరుతో దళారుల రంగప్రవేశం

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 29(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఈ నెల 19న పెదవాగు ప్రాజెక్టు గండిపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రాజెక్టు పరిధిలోని నారాయణపురం, కమ్మంపాడు, గుమ్మడివెల్లి, బచ్చువారిగూడెం గ్రామాల్లో 391.19 ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇసుక మేటలు వేసి, 363మంది రైతుల వ్యవసాయం కుంటుపడింది. పొలాల్లో వేసిన వరినాట్లు, నారు మళ్లను ఇసుక మేటలు కప్పేశాయి. ప్రభు త్వం నష్ట పరిహారం చెల్లించేందుకు హామీ ఇచ్చినా రైతుల పరిస్థితి కడుదయనీయంగా ఉంది. ఇదిలా ఉండగా ఇసుక తొలగింపుపై అధికారులు సమగ్ర సర్వే చేపట్టనే లేదు అప్పుడే దళారులు రంగ ప్రవేశం చేశారు. ఇసుక మేటలను ట్రాక్టర్లు, జేసీబీలతో తామే తొలగిస్తామంటూ తిరుగుతున్నారు.