calender_icon.png 12 February, 2025 | 11:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు ఇండ్లు అగ్నికి ఆహుతి..

12-02-2025 08:26:35 PM

ఐదు లక్షల ఆస్తి నష్టం..

బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ..

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అసిఫాబాద్ మండలం కొత్త రహపెళ్లిలో బుధవారం మధ్యాహ్నం మూడు ఇండ్లు సెండే బాపు, సెండే అన్నారవ్, అనంతరావ్ తో పాటు వినాయకరావ్ కు చెందిన షెడ్ అగ్నికి ఆహుతయ్యాయి. ఇంటి యజమానులు లేకపోవడంతో ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఇంటి పక్కన వాళ్ళు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో కాగజ్ నగర్ నుండి మూడు ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశాయి. ఫైర్ అధికారి భీమయ్య వివరాలు తెలుపుతూ దాదాపు 5 లక్షల ఆస్తి నష్టం జరిగిందని, రెండు సిలిండర్లు పేలిపోయాయని తెలిపారు. మంటలు ఆర్పే ప్రక్రియలో లీడ్ ఫైర్ మాన్ విజయ్ కుమార్ తో పాటు ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు.

బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే..

ఇండ్లు అగ్నికి ఆహుతయాయని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ తో కలిసి అక్కడికి చేరుకొని వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు చేతికి వచ్చిన పత్తి పంట అగ్నికి ఆహుతి కావడం పట్ల ఎమ్మెల్యేకు గోడు వినిపించుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణ సహాయం కింద ఒక్కరికి 5 వేల రూపాయలు చొప్పున నగదు అందజేయడంతో పాటు, నూతన వస్త్రాలు, సుమారు రూ.50 వేల  సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ నాయకులు పాల్గొన్నారు.