అశ్వారావుపేట, నవంబర్ 22: హమాలీగా పనిచేస్తున్న వ్యక్తి కూతురు మూడు సర్కారు కొలువు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండల కేంద్రానికి చెందిన బోగి సత్యం, రమణ దంపతులు. సత్యం గ్రామంలో ఉన్న జీసీసీలో హమాలీగా పనిచేస్తున్నాడు. రమణ అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తున్నది. వారి పెద్ద కుమార్తె సమ్మక్క మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది.
మొదట సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన సమ్మక్క ఆ తర్వాత గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ (జీసీసీ) ఉద్యోగాలు సాధించింది. ఇప్పుడు జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగం సా ధించింది. అయితే జీసీసీ లో తన తండ్రి హమాలీ పని చేసి ఆమెను చదివించారో అదే జీసీసీలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం పొందటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన మండల ప్రజలందరూ అబ్బురానికి గురయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క మాట్లాడుతూ.. సివిల్స్ సాధించడమే తన లక్ష్యం అని తెలిపారు.