calender_icon.png 22 November, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీ బిడ్డకు 3 గవర్నమెంట్ ఉద్యోగాలు దాసోహం

22-11-2024 06:41:53 PM

అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండల కేంద్రంలో నిజీసీసీ లో హమాలీగా పనిచేస్తున్న బోగి సత్యం, అంగన్వాడీ కార్యకర్త బోగి రమణ దంపతుల పెద్ద కుమార్తె సమ్మక్కకు 3 ప్రభుత్వ ఉద్యోగాలు దాసోహం అయ్యాయి. అంటే ఆమె ఎంత కష్టపడి ఉంటారో, ఎంత కఠోర దీక్షతో చదివి ఉంటారో ఆమె మేథశక్తి ముందు ఈ కఠిన పరీక్షలు ఎంత మాత్రమూ నిలువ లేనివని మరొకసారి రుజువయింది.

ఈమెను రోల్ మోడల్ గా యువత తీసుకుంటే యువతకు మేలు జరుగుతుందనేది నిజం. వివరాల్లోకి వెళితే ముందుగా సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం, గ్రూప్ 4 లో జూనియర్ అసిస్టెంట్ జీసీసీ లో, ఇప్పుడు జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగం సాధించి, ఏ జీసీసీలో తన తండ్రి హమాలీ పని చేసి ఆమెను చదివించారో అదే జీసీసీలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం పొందటం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని చదువుల సరస్వతి తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసిన మండల ప్రజలందరూ అబ్బురానికి గురయ్యారు. ఈ సందర్భంగా అత్యంత మేధసంపత్తి కలిగిన సమ్మక్క మాట్లాడుతూ.. ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని దృఢ సంకల్పంతో సివిల్స్ కు ప్రిపేర్ అయ్యి సివిల్స్ సాధించడమే తన లక్ష్యం అని ఆమె తెలిపారు.