21-03-2025 11:30:50 PM
మండలంలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
మొదటి రోజు ఐదుగురు గైర్హాజరు
అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేటలో పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మూడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొదటి రోజు ఐదుగురు విద్యార్థులు పరీక్షలకు హాజరుకాలేదు. మండల వ్యాప్తంగా 6 జిల్లా పరిషత్తు ఉన్నత పా ఠశాలలు 5 గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మూడు గురుకుల పాఠశాలలు, ఐదు ప్రైవేటు పాఠశా పాటలలకు చెందిన పదో త రగ తి విద్యార్థులు పరీక్షలు రాశారు. విద్యార్థులు మొదటిసారి పబ్లిక్ పరీక్షల కు హాజరైన తరుణంలో కేంద్రాల వద్ద చిన్నారులు, తల్లిదండ్రులతో కోలాహలం నెలకొంది.
అశ్వా వుపేటలో జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో 200 మందికిగాను 197 మంది పరీక్షలకు హాజరయ్యారు బాలికల ఉన్నత పాఠశాలలో 257 మందికి 256 మంది పరీక్షలు రాయగా ఒకరు గై రాజరయ్యారు మండలంలోని సున్నంబట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేం వ్రంలో 180 మందికి 138 మంది హాజరయ్యారు. మూడు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 596 మందికి 591 మంది పరిక్షలు రాశారు. మండలంలోని భీమునిగూడెం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు దమ్మ పేట మండలంలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో పది పరీక్షలు రాశారు. విద్యార్థులకు తాగునీరు, ఇతర ఇబ్బందులు లేకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాలను ఎస్ఐ యయాతి రాజు సందర్భం చారు. బందోబస్తు వరంగా ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా భర్తిస్తాయిలో చర్యలు చేపట్టారు.