calender_icon.png 4 April, 2025 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు చేయాలి

11-12-2024 01:35:12 AM

* అధికారులను ఆదేశించిన భద్రాద్రి కలెక్టర్ 

భద్రాచలం, డిసెంబర్ 10: భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలోని భద్రాచలంలో నిర్వహించే ముక్కోటి మహోత్సవాలు సజావుగా జరి గేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మం గళవారం భద్రాచలం ఆర్డీ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల నిర్వాహ ణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్దేశించిన పనులను ఎలాం టి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసరా ల్లో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని అధికా రులకు ఆదేశించారు.

హంస వాహనంలోకి పరిమిత సంఖ్యలో మాత్రమే అను మతిం చాలన్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుం డా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. భక్తులకు సురిక్షిత మంచినీరు సరఫ రా చేయాలన్నారు. భక్తులకు బస్సులు, రైల్వే సమయాలను జిల్లాలోని ప్రముఖ దర్శనీ య స్థలాలను తెలియజేయు చార్టులు ఏర్పా టు చేయాలని ఆదేశించారు. వాహనాల పార్కిం గ్ స్థలాలకు సైన్‌జ్ బోర్డ్సు ఏర్పాటు చేయా లన్నారు.

భద్రాచలం కరకట్ట వద్ద మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రణాళికలు సిద్ధం చేయడంలో అలసత్వం వహించిన అధికా రుల పట్ల అసహనం వ్యక్తం చేశారు. సమా వేశంలో ఎస్పీ రోహిత్‌రాజు, ఐటీడీఏ పీఓ రాహూల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, అదనపు కలెక్టర్ విద్యాచందన, ఈవో రమా దేవి, ఆర్డీవో దామోదర్‌రావు పాల్గొన్నారు.