పొలంలో తీగ తగిలి రైతు మృతి
గద్వాల (వనపర్తి), ఆగస్టు 6 (విజయక్రాంతి): విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన ఘటన మంగళవారం గద్వాల జిల్లా గట్టు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గట్టు మండలం ఎర్రసన్‌దొడ్డి గ్రామానికి చెందిన కురువ బుడ్డన్న(58) తన వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు. పొలంలో కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
మోటర్ ఆన్ చేస్తుండగా ఇద్దరు..
నిజామాబాద్(విజయక్రాంతి)/సూర్యా పేట: నిజామాబాద్ నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన కొట్టూరి శ్రీనివాస్(45) వర్షం కురుస్తున్న వేళ తన ఇంట్లోని సంపు నుంచి నీటిని తోడేందుకు విద్యుత్ మోటార్‌ను ఆన్ చేసే ప్రయత్నం చేశాడు. అప్పటికే మోటారు తడి సి ఉండటాన్ని గమనించని శ్రీనివాస్ దానికి తగలడంతో షాకు గురై మృతిచెందాడు. సూర్యాపేట మండలంలోని జాటోత్‌తండా పరిధిలోని బోజ్యాతండాకు చెందిన వాంకుడోతు నాగునాయక్(33) ఇంటిలోని నీటి మోటార్‌ను ఆన్‌చేయగా.. విద్యుత్ సరఫరా జరిగి మృతిచెందాడు.