14-04-2025 12:00:00 AM
అనాథ, దివ్యాంగుల జంటలకు ఘనంగా వివాహం
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): జగిని ఫర్నిచర్స్ అధినేత జగిని శ్రీనివాస్, యడవెల్లి బాలరాజు, రూపాయి ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్, కేవీ ప్రసాద్, రామ్ సేవా సమితి ట్రస్ట్ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో సైదాబాద్ డివిజన్, ఎస్‌బీహెచ్ కాలనీలోని శ్రీనివాస కమ్యూనిటీ హాల్‌లో ఆదివారం మూడు అనాథ, దివ్యాంగుల నిరుపేద జంటలకు వివాహం జరిపించారు.
జగిని శ్రీనివాస్, నాగమల్ల అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. ఒకేసారి మూడు జంటలకు పెళ్లి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పెళ్లి బట్టలు, తాళి, మట్టెలు అందజేసి వేద పండితుడి ఆధ్వర్యంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పెళ్లి జరిపామని అన్నారు. పెళ్లికి వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం ఏర్పాట్లు కూడా చేశామని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద, దివ్యాంగ వధూవరులు తమ పెళ్లి కోసం తమను సంప్రదిస్తే వారి వివాహన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు. వివరాలకు 9246736533 నంబరులో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రాంసేవా సమితి అధ్యక్షుడు నర్సింహారావు, సభ్యులు నీల వెంకటేశ్, శ్రీరాములు, సురేష్, వినోద్, ఉప్పల వెంకటేష్, నాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.