ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం మారుతి, హను రాఘవపూడి కాంబినేషన్‌లో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు. ఇవి పూర్తయిన వెంటనే ‘స్పిరిట్’ పట్టాలెక్కించనుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది.
వచ్చే ఉగాది పండుగ తర్వాత నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. అయితే ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి. ప్రభాస్ ఈ చిత్రంలో మూడు పాత్రలు పోషిస్తున్నాడని సమాచారం.
స్టూడెంట్ లీడర్‌గానూ.. ప్రొఫెసర్ గానూ.. పోలీస్ అధికారిగానూ నటించనున్నాడని తెలుస్తోంది. ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులుండవు.
మొత్తానికి సినిమాను అయితే సందీప్ రెడ్డి వంగా ఓ లెవల్లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని దేశంలోని పలు భాషల్లోనే కాకుండా చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.