కరీంనగర్, అక్టోబర్ 8 (విజయక్రాంతి): ముగ్గురు చైన్ స్నాచ ర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కరీంనగర్ రూరల్ మండలం ఎలబోతా రం గ్రామానికి చెందిన ఎడవెల్లి దీపక్, ఎడవెల్లి చందు, వెల్గటూరు మండలం సంకెనపల్లి గ్రామానికి చెందిన సింహరాజు నరేష్ జల్సాల కు అలవాటుపడి, సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశం తో దొంగతనాలు చేస్తున్నారు.
మం గళవారం ఉదయం పోలీసులు తీగలగుట్టపల్లిలోని అమ్మగుడి చౌరస్తా లో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. వారి నుంచి 105.85 గ్రాముల బం గారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితు లు కరీంనగర్‌లోని పలు ప్రాంతా ల్లో మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్టు రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.