ముగ్గురు కౌన్సిలర్లు బిజెపిలో చేరిక..
ఆదిలాబాద్, (విజయక్రాంతి) : ఆదిలాబాదులో గులాబీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ముగ్గురు మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీని వదిలి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం అదిలాబాద్ ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు సంజయ్, నెమలికొండ విషు, భరత్ కుమార్ బీజేపీ లో చేరడంతో వారిని సాదరంగా ఆహ్వానించి ఎమ్మెల్యే పాయల్ శంకర్ బిజెపి కండువాలు కప్పారు. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పెరిగిన జనాధారణ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని బిజెపిలో చేరడం జరిగిందని కౌన్సిలర్లు తెలిపారు. వీరి వెంట 150 మంది కార్యకర్తలు బిజెపి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు లాలామున్న, రఘుపతి, కృష్ణ యాదవ్, ఆకుల ప్రవీణ్ శ్రీనివాస్ ముకుందరావు, వేద వ్యాస్, సచిన్, సూర్య కిరణ్, శివ రాజు, రమేష్, నాగన్న తదితరులున్నారు.