గద్వాల టౌన్, నవంబర్ 18: ఒకే కాన్పులో ఓ తల్లి ముగ్గురు పిల్లలకు జన్మని చ్చింది. గద్వాల పట్టణంలోని వడ్ల వీధికి చెందిన జయశ్రీ, రజక సురేష్ దంపతులు. జయశ్రీకి మొదటి కాన్పులో కూతురు జన్మించింది. రెండవ కాన్పు కోసం జయశ్రీ ని సోమవారం పట్ణంలోని ప్రైవేట్ ఆసుప త్రికి తీసుకెళ్లారు.
పరీక్షించిన వైద్యులు హైరి స్కుగా ఉన్నట్టు గుర్తించి ఆపరేషన్ చేయగా, ముగ్గురు శిశువులు జన్మించారు. అందులో ఒక పాప, ఇద్దరు బాబులు ఉన్నారు. శిశువులు ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారు.