జనగామ, జనవరి 13 (విజయక్రాంతి): జనగామలో యువకుడిని హత్య చేసిన ముగ్గురు నిందితులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ నితిన్ పాందేరీ వివరాలను వెల్లడించారు. ధర్మకంచకు చెం గాండ్ల సంపత్, మహమ్మద్ హైదర్, వెంకన్నకుంటకు చెందిన మా లక్ష్మణ్ కలిసి వెంకన్న(30) అనే యువకుడికి మద్యం తాగించి హతమార్చినట్లు వివరించారు.
వెంకన్నకు, గాండ్ల సంపత్‌కు రెండేళ్ల క్రితం ఓ గొడవ జరిగిందని, అది మనసులో పెట్టుకుని ముగ్గురు కలిసి శనివారం రాత్రి హత్య చేసినట్లు చెప్పారు. 24 గంటల్లో నిందితులను పట్టుకున్న నర్మె సీఐ అబ్బయ్య, జనగామ ఎస్సై చెన్నకేశవులు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు.