21-04-2025 11:33:06 PM
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలో భూతగాధాలను మనుసులో పెట్టుకొని ఓ వ్యక్తిపై దాడి చేసి కొట్టిన ఘటనలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు కన్నెపల్లి ఎస్ఐ గంగారాం తెలిపారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిని మండలం టేకులపల్లిలో పెద్దపల్లి ప్రశాంత్ కట్టుకుంటున్న ఇంటి వద్ద పనిచేస్తూ ఉండగా తన సొంత గ్రామస్తులు పెద్దపల్లి నగేష్, పెద్దపల్లి గణేష్, పెద్దపల్లి సురేష్ లమధ్య గత కొన్ని రోజులుగా భూతగాదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొని గణేష్ సురేష్ నగేష్ పెద్దపల్లి ప్రశాంత్ ను కర్రలతో దాడి చేసి కొట్టారు. ఈ మేరకు ప్రశాంత్ తనపై దాడి చేసినట్లు పోలీస్ స్టేషన్ కి వచ్చి పిటిషన్ ఇచ్చాడు. కేసు నమోదు చేసుకోని ముగ్గురిని అరెస్టు చేసి తహసీల్దార్ ముందు బైండోవర్ చేశారు.