బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో స్థానిక కాంట్రాక్టర్ సురేశ్ చంద్రశేఖర్ కొత్తగా నిర్మించిన సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహం లభ్యమైన 33 ఏళ్ల జర్నలిస్టు హత్య కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు శనివారం తెలిపారు. కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్‌ను బీజాపూర్ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ముకేష్ చంద్రకర్ అనే ఫ్రీలాన్స్ జర్నలిస్టు(Freelance Journalist) జనవరి 1న అదృశ్యం కాగా, శుక్రవారం నాడు బీజాపూర్ పట్టణంలోని చట్టన్‌పర బస్తీలో కాంట్రాక్టర్ సురేష్ చంద్రకర్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో అతని మృతదేహం లభ్యమైంది. ఈ హత్యకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఇక్కడి అధికారి ఒకరు తెలిపారు. అయితే వారి పేర్లను పోలీసులు వెల్లడించలేదని, ఆ రోజు తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
ముఖేష్ ఎన్‌డిటివితో సహా వార్తా ఛానెల్‌లకు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేశారు. 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్న ‘బస్తర్ జంక్షన్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడిపారు. 2021 ఏప్రిల్‌లో బీజాపూర్‌లోని తకల్‌గూడ నక్సల్స్ ఆకస్మిక దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది వీరమరణం పొందిన కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను మావోయిస్టుల చెర నుండి విడుదల చేయడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను బుధవారం సాయంత్రం అదృశ్యమయ్యాడని, అతని అన్న యుకేష్ చంద్రకర్ మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.
ముఖేష్ మొబైల్ నంబర్‌ను ట్రాక్ చేయడంతో, పోలీసులు సురేష్ చంద్రకర్‌కు చెందిన ఆస్తికి చేరుకుని, కాంక్రీట్ స్లాబ్‌తో తాజాగా వేసిన సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని కనుగొన్నారు. రోడ్డు నిర్మాణంలో అవినీతి జరిగిందని ఇటీవల ముఖేష్ కథనంలో తెలిపారు. ముఖేష్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కరోప్షన్ సంబంధిత వార్తలను పరిశోధించి నివేదించేవాడు. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి(Chhattisgarh CM Vishnu Deo Sai) హత్యను తీవ్రంగా ఖండిస్తూ 'నిందితులను విడిచిపెట్టబోము' అని అన్నారు. తాను ముఖేష్ చంద్రకర్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.ఈ కష్ట సమయంలో వారికి అండగా నిలుస్తున్నాను" అని ఛత్తీస్‌గఢ్ సీఎం పేర్కొన్నారు.