28-04-2025 07:24:51 PM
నిషేధిత గంజాయిపై ఉక్కుపాదం..
విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసిపి మడత రమేష్...
మంథని (విజయక్రాంతి): ప్రభుత్వ నిషేధిత గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపి మడత రమేష్(Godavarikhani ACP Madatha Ramesh) తెలిపారు. కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం గుండారం గ్రామ శివారులోని రాజేందర్ నగర వద్ద ముగ్గురు వ్యక్తులు రెండు కిలోల గంజాయి తరలింపుకు సిద్ధంగా ఉన్న వారిని పక్క సమాచారం మేరకు కమాన్ పూర్ ఎస్ఐ కొట్టే ప్రసాద్ దాడి చేసి పట్టుకున్నారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని చింతూరు మండల కేంద్రం చెందిన సవలం మల్లేష్ జగిత్యాల జిల్లా గుడిసెలపేట చెందిన అలక సందీప్, మద్దెల హరీష్ లు ద్విచక్ర వాహనంపై రెండు కిలోల గంజాయిని ఓపెన్ ప్లాట్స్ వద్ద తరలించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పక్క సమాచారంతో ఎస్ఐ కొట్టే ప్రసాద్ తన సిబ్బందితో వెళ్లి ముగ్గురుని అదుపులోకి తీసుకొని వారి వద్ద రెండు కిలోల గంజాయి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసిపి తెలిపారు.
అలాగే తమ తల్లిదండ్రులు పిల్లలను గంజాయికి మత్తుకు బానిస కాకుండా చూసుకునే బాధ్యత వారి కుటుంబ సభ్యులపై ఉందని ఏసీపి రమేష్ అన్నారు. కోల్ బెల్ట్ ప్రాంతంలో నిషేధిత గంజాయి పై ఉక్కు పాదం మోపడం జరుగుతోందని ఎప్పటికప్పుడు బస్టాండ్లలో రైల్వేస్టేషన్లో నిఘా పెట్టి అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేయడం జరుగుతుందని ఎసిపి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా గంజాయి అమ్మితే తమకు సమాచారం ఇస్తే తమ పేర్లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో గోదావరిఖని టూ టౌన్ సిఐ నక్క ప్రసాద్ రావు, కమాన్ పూర్ ఎస్సై కొట్టే ప్రసాద్, ఏఎస్సై బాలాజీ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.