29-03-2025 01:10:10 AM
కరీంనగర్ క్రైం, మార్చి 28 (విజయ క్రాంతి): గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ స్టేడియం వద్ద వన్టౌన్ సీఐ కోటేశ్వర్ నేతృత్వంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా..బీహార్కు చెందిన నీరజ్ కుమార్, సుపౌల్, దిలేందర్ కుమార్ ల వద్ద 1 కిలో 180 గ్రాముల ఎండు గంజాయి లభ్యమైంది.
అదుపులోకి తీసుకున్న నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.